![]() |
![]() |
.webp)
ఢీ ప్రీమియర్ లీగ్ లో ఈ వారం ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. కొరియోగ్రాఫర్ ప్రభు టీమ్ లో సురేష్ అనే కంటెస్టెంట్ వాళ్ళ తాతయ్యను ఆది నడిపించుకుంటూ స్టేజీ మీదకు వచ్చాడు. అలా తీసుకొస్తున్నప్పుడు శేఖర్ మాష్టర్ నవ్వుతూ ఒక పెద్దాయన ఇంకో పెద్దాయన్ని తీసుకొస్తున్న ఈ సీన్ తనకు చాలా నచ్చిందంటూ ఒక కామెడీ సెటైర్ వేశారు.
"నేను తీసుకురావడం కాదండి..ఆయనే అడిగారు. నన్ను స్టేజి మీదకు ఎక్కించారు పాయల్ తో డాన్స్ వేయించరా అనేసరికి పాయల్ ఎలా తెలుసు అని అడిగా.. ఒకసారి టీవీలో చూశాడట అప్పటి నుంచి ఒక్క స్టెప్పయినా సరే పాయల్ తో వేయాలనుకుంటున్నాడట " అని అడిగారంటూ చెప్పాడు ఆది. ఇక వెంటనే పాయల్ లేచి ఆ తాత దగ్గరకు వెళ్ళింది ఆది ఇటు నుంచి ఆ తాతయ్య భార్యను స్టేజి మీదకు పిలిచాడు. పాయల్ వచ్చేసరికి తాతయ్య కళ్ళల్లో ఆనందం, పెదాలపై చిరునవ్వు వచ్చేసరికి "పాయల్ రాజపుత్ అని నీకు తెలీదులే..ఆయనకు తెలుసు... చూసావామ్మా ఎప్పుడైనా నీ ముందు ఇలా ఎప్పుడైనా నవ్వాడా..మీ పెళ్లి టైంలో కూడా అలా నవ్వి ఉండడు" అంటూ ఆ తాతయ్య భార్యను అడిగాడు.
తర్వాత "సరసకు చెలి చెలి రా" అని పాట పెట్టేసరికి తాతయ్య మంచి ఊపుతూ పాయల్ తో కలిసి చిందేసాడు. తాత వేసిన స్టెప్పుకు ఆ బామ్మ ఏమీ అనకపోయేసరికి "అలాంటి భార్య అందరికి దొరికితే ఎంత బాగుంటుంది..ఎం చేసుకున్న పర్లేదు అనే ఫ్రీడమ్ ప్రతీ మొగుడికి దొరికితే బాగుండు " అంటూ డైరెక్టర్ అజయ్ కామెంట్ చేసాడు. దాంతో ఆది "ఏమయ్యా మీ ఆవిడ నీ డాన్సులు చూసి అలిగి బుంగమూతి పెట్టుకుంది ప్రొపోజ్ చేస్తావా" అని తాతను అడిగేసరికి " ఐ లవ్ యు" ఆ తాత బామ్మకు ప్రొపోజ్ చేసాడు.
![]() |
![]() |